తొలి తెనుగుపత్రిక శత సంవత్సర వేడుకలను జయప్రదం చేయాలి !

👉 శతసంవత్సర వేడుకలకు ఇనుగుర్తి రానున్న ప్రముఖపాత్రికేయులు, మనతెలంగాణ పత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ !


J.SURENDER KUMAR,


నైజాంసర్కార్ పాలనలో ఆకృత్యాలను ఎదిరించి నిలిచేందుకు తెలంగాణ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు ఇనుగుర్తి గ్రామానికి చెందిన కవులు రచయితలు ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు లు కలిసి ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రాంతంలో ‘తొలి తెలుగు దినపత్రిక’ “తెనుగుపత్రిక” శతసంవత్సర వేడుకలను ఈ నెల 27న ఇనుగుర్తి రైతు వేదిక భవనంలో నిర్వహిస్తున్నట్లు ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఒద్దిరాజు సుభాష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలి తెలుగు దినపత్రిక తెనుగుపత్రిక పేరుతో ముద్రించి వంద సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో ఈనెల 27న నిర్వహించే శతసంవత్సర వేడుకలతో పాటు సీనియర్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ భవనంలోనే ముద్రితమైనది (ఫైల్ ఫోటో)

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ పాత్రికేయులు, మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ పాల్గొంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయ జిల్లా సంఘాల బాధ్యులు, జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అధిక సంఖ్యలో హాజరై తెనుగుపత్రిక శతసంవత్సర వేడుక లను విజయవంతం చేయాలని ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఒద్దిరాజు సుభాష్ కోరారు.