👉ధర్మపురి దేవుడికి దాతలు దాదాపు ₹ 10 లక్షల విలువగల వెండి పీఠం బహుకరణ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి దాదాపు ₹10 లక్షల కు పైన విలువగల దాదాపు 12 కిలోల వెండి సేవ పీఠాన్ని దాతలు విరాళంగా ఇచ్చారు. అయితే దాతల ఎవరు అనే విషయం ఆలయ అధికారులు ప్రకటించకపోవడంతో చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళితే..
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవమూర్తుల సేవ బుధవారం క్షేత్రంలో ఊరేగించారు. దాతలు ఇచ్చిన వెండి పీఠం పై ఊరేగింపు జరగడంతో. భక్తజనం పరవశించిపోయారు. స్వామివారికి ఎవరో దాతలు బహుకరించిన దాదాపు 12 కిలోల వెండితో ఆలయ అధికారులు సేవా పీఠం చేయించినట్లు సమాచారం.

ఇంత పెద్ద మొత్తంలో ఆలయానికి వెండి పీఠం కోసం విరాళాలు ఇచ్చిన దాతలు పేర్లు ఆలయ అధికారులు ప్రకటించకపోవడంలో అంతర్యం ఏమిటో ? అని భక్తజనం చర్చించుకుంటున్నారు. దాతల నుంచి అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయానికి సేకరిస్తున్న విరాళాలు అభినందనీయమైన, దాతల పేర్లు బహిరంగపరచకపోవడం బాధాకరమైన భక్తులు ఆరోపిస్తున్నారు.