J.SURENDER KUMAR,
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

వెల్గటూర్ మండల కేంద్రంలో బుధవారం అర్హులైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాభక్తులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వెలుగటూరు మండలానికి ₹ 45,05,220 లక్షల రూపాయల విలువ గల 45 మంది లాభక్తులకు, మరియు ఎండపెల్లి మండలానికి చెందిన ₹ 31,03,596 లక్షల రూపాయల విలువ గల 31 చెక్కులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు..