ఆరు గ్యారెంటీలను వంద శాతం అమలు చేస్తాం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వందకు వంద శాతం అమలు చేయడం జరుగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుగ్గారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాములను గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రైతులకు మేలు చేసే ఎరువుల గోదాములను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యే అన్నారు.


ఆరు గ్యారెంటీ అమలు విషయంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్న ధర్మపురిలో నా క్యాంపు కార్యాలయంలో స్వయంగా నన్ను కలవవచ్చని ఈ సంధర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు