బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మారం మండలకేంద్రానికి చెందిన కాడే సూర్యనారాయణ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన సూర్యనారాయణ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..


అనంతరం రామయ్యపల్లి గ్రామానికి చెందిన కోట రాజయ్య మరియు రచ్చపెల్లి గ్రామానికి చెందిన గుర్రం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.


వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
మర్యాదపూర్వకంగా…
జగిత్యాల జిల్లా రెడ్డి జన సంక్షేమ సంఘం ఎన్నికల్లో ఇటీవల గెలిచిన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.