బాధితులను పమర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు.


పెగడపెల్లి మండలం రామాబద్రుని పల్లె గ్రామానికి చెందిన బొజ్జ రిత్విక అనారోగ్యంతో కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రిత్వికను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.


అనంతరం అనారోగ్యంతో అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ధర్మపురి కి చెందిన గజ్జల రాంచరణ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వీడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే కోరారు.