బతుకమ్మలో అందంగా పూలు పేర్చినట్టు జీవితాన్ని నిర్మించుకోవాలి !

👉 బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం !


👉 జగిత్యాల జిల్లా జడ్జ్ జస్టిస్ నీలిమ !


J.SURENDER KUMAR,

బతుకమ్మ లో ఉపయోగించే పూలను అందంగా పేర్చినట్టుగా

కష్టపడి ప్రతి విద్యార్థి తన జీవితాన్ని అందంగా

నిర్మించుకోవాలని జగిత్యాల జిల్లా జడ్జి జస్టిస్ నీలిమ

అన్నారు.


జిల్లా కేంద్రంలోని ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో మహిళా సాధికారత విభాగం మరియు సాంస్కృతిక శాఖ ఎన్ఎస్ఎస్ ఎన్సిసిల ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకలకు జస్టిస్ నీలిమ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


👉ఈ సందర్భంగా జస్టిస్ నీలిమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..


మన సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడుతుంది, బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం అని నేటి యువత బతుకమ్మను గూర్చి తెలుసుకోవాలి అన్నారు.


నేటి యువత మన సంస్కృతి సంప్రదాయాల పట్ల లోతైన అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా సెల్ ఫోన్లు లో ఎక్కువ సమయం వృధా చేయకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని, ఆమె విద్యార్థులకు వివరించారు.


తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని , వారు గర్వించే విధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య అరిగెల అశోక్, విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ లో జరుపుకునే ఒక విశిష్టమైన పండుగని ఆడబిడ్డకు విలువను గూర్చి తెలుపుతుందని తెలిపారు.

బతుకమ్మ వల్ల జీవితం పూలలో ఉన్న రంగుల వలె వికసిస్తుందాన్ని, సంతోష ఆనందాలను అమ్మవారు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కందుకూరి శ్రీనివాస్, ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ పి రాజు , అధ్యాపకులు సురేందర్, సాయి, మధుకర్, గోవర్ధన్, రామచంద్రం, రజిత, సుప్రియ , ప్రతిభ, కవిత, స్వప్న ,ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, క్యాడెట్లు బోధననేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.