బాధితుల న్యాయం కోసం నేర దర్యాప్తు కీలకం కావాలి !

👉పోలీస్ డ్యూటీ మీట లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ !


J.SURENDER KUMAR,


బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే సరైన , అధారాలు, నేర దర్యాప్తు చాల కీలకం కావాలి అని జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం నిర్వహించారు.

దానిలో భాగంగా గౌరవ డిజిపి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి జిల్లాస్దాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పి ప్రారంభించారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్ , ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్ , ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్ విభాగాల్లో పోటీలు, ఫొటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ… సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు. అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానిక చక్కని వేదిక అన్నారు. ఈ యొక్క డ్యూటీ మీట్లో ఉత్తమ ప్రతిభ చూపాలని అన్నారు. జాతీయ స్దాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు మంచి గుర్తింపు వుంటుందని అన్నారు.

ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు,జాతీయ స్ధాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సహం లభిస్తుందని అన్నారు. సంక్లిష్టమైన కేసులు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రఫీ ఖాన్, లక్ష్మీనారాయణ, రామ నరసింహారెడ్డి, రవి, సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు