👉జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనం !
J.SURENDER KUMAR
కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఆదేశాలు అందరికీ వర్తిస్తాయని ఆచరించి తమ శాఖ యంత్రాంగానే జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అబ్బురపరిచారు. ప్రశాంత్ నిమజ్జన చర్యల్లో భాగంగా బైక్ పై పర్యటిస్తూ బందోబస్తు చర్యలను పర్యవేక్షించడంతోపాటు బుధవారం తెల్లవారుజాము వరకు జగిత్యాల పట్టణ వీధుల్లో పోలీసు యంత్రాంగం తో కలసి జాగారం చేశారు. వీరితోపాటు జిల్లాలో వివిధ మండలాల పోలీస్ యంత్రం కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు.

వివరాల్లోకి వెళితే..
జగిత్యాల పట్టణంతోపాటు జిల్లాలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరగాలంటూ పోలీస్ యంత్రాంగంతో ఎస్పీ పలుమార్లు ముందస్తు సమీక్ష సమావేశాలను నిర్వహించి సలహాలు సూచనలు చేపట్టాల్సిన చర్యల గురించి తమ అధికారులకు వివరించారు.

నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అని నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా సాగేందుకు జిల్లా పరిధిలో 24 X 7 పని చేస్తూ భద్రత పరంగా పూర్తి స్థాయిలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

నిమజ్జన ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

ఎస్పీ క్షేత్రస్థాయిలో బైక్ పై నిమజ్జన ప్రదేశాలను మరియు ముఖ్యమైన ప్రదేశాలను పికెట్స్ ను పరిశీలించి అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట రఘు చందర్ ,రవీంద్ర కుమార్, రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు , ఇతర శాఖల అధికారులు తదితర పాల్గొన్నారు.