ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ 10మంది మావోయిస్టులు మృతి !

J.SURENDER KUMAR,


ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సంయుక్త బృందం మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:30 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది.”ఇప్పటి వరకు, పది మంది మావోయిస్టులు హతమయ్యారు  సంఘటన స్థలం నుండి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), .303 రైఫిల్ మరియు .315 బోర్ రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు ప్రకటన.

ఫైల్ ఫోటో.


“ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది మరియు ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.