ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి !

👉మరో ఎనిమిది మంది మృతి !


J.SURENDER KUMAR,


మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ,మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా. కేంద్ర కమిటీ సభ్యుడు ,కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ ,, మృతిచెందినట్టు దంతేవాడ పోలీసుల ధ్రువీకరించారు..  కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందినట్లు దంతేవాడ ఎస్పి ప్రకటించాడు ఎన్కౌంటర్లో మరో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఆయుధాలు మందు గుండు సామాగ్రిని భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి.

జగన్ ఫైల్ ఫోటో.


ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సంయుక్త బృందం మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 10:30 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది.”ఇప్పటి వరకు, 9 మంది మావోయిస్టులు హతమయ్యారు  సంఘటన స్థలం నుండి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), .303 రైఫిల్ మరియు .315 బోర్ రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు ప్రకటన.