J.SURENDER KUMAR,
జెడ్ ప్లస్ భద్రత కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత కోసం మహిళా సిబ్బందితో పాటు
CRPF కమాండోలతో అదనపు బలగాలను నియమించనున్నారు .
వివిఐపిలతో సహా ప్రజా ప్రతినిధులకు భద్రత కల్పించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యు) అధికారులు ప్రతిపక్ష నాయకుల నిరసనలు, మరియు సంఘ వ్యతిరేక కదలికల అనుమానాస్పద కదలికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి భద్రతను సమీక్షించారు.
ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ వింగ్ సిబ్బందికి SPG కమాండోలతో సమానంగా శిక్షణ ఇవ్వనున్నారు. సీఎంకు జెడ్ ప్లస్ భద్రత బలగాలలో 55 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అదనంగా, CRPF కమాండోలు ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ వింగ్ 24×7 సిబ్బందితో పాటు అనుక్షణం సీఎం ను అనుసరిస్తూ ఉంటారు.