సీఎం రేవంత్ రెడ్డికి పోలీసు అధికారుల సంఘం వినతి పత్రం !

👉మా సమస్యలు పరిష్కరించండి!


J.SURENDER KUMAR,


చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మా సమస్యలు పరిష్కరించండి అంటూ తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన వినతి పత్రం లో పేర్కొన్నారు.


👉వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలు ఇలా ఉన్నాయి


👉 పెండింగులో ఉన్న 4 డి.ఎ.లు, 3 సరెండర్లు, పి.ఆర్.సి. ఏరియర్స్, జిపిఎఫ్, మెడికల్ బిల్లులు, టి.ఎ.లను ఇప్పించగలరని మనవి.


👉ఆరోగ్య భద్రత నుండి ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగు ఉండడం వల్ల ఆసుపత్రులు పోలీసులకు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నాయి. కావున, ప్రభుత్వంనుండి రావలసిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయించగలరని మనవి.


👉అనిశ్చిత సమయాల్లో విధుల వల్ల పోలీసు ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కావున, ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించాలని మనవి.


👉 ఎంతో కాలంగా కోరుతున్న ర్యాంకర్ ఎస్ఐ పదోన్నతి కోటాను అన్ని వింగుల్లో 50 శాతానికి పెంచి ప్రతి కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు ఎస్ఐ అయ్యేలా అవకాశం కల్పించాలని మనవి.

👉గత పి.ఆర్.సి. ఆమోదించినప్పటికీ అడిషనల్ హెచ్ఎస్ఏ, రేషన్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్, రిస్క్ అలవెన్స్, డ్రైవర్ అలవెన్స్, ట్రైనింగ్ సెంటర్స్ అలవెన్సు, అంత్యక్రియల ఖర్చుల జి.వో.లు ఇవ్వలేదు. కావున,అట్టి జీవోలను ఇప్పించాలని మనవి.


👉 పోలీసు ఉద్యోగులకు మ్యూచువల్, స్టాజ్, మెడికల్ బదిలీలకు అవకాశం కల్పించాలని మనవి.


👉తమిళనాడు తరహాలో పోలీసులకు, హోంగార్డులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని మనవి.


👉 చిరకాల కోరికగా పెండింగులో ఉన్న పోలీసు ఉద్యోగులకు, హోంగార్డులకు ఇంటి స్థలాలు మంజూరు చేయించాలని మనవి.


👉హోంగార్డులకు కారుణ్య నియామకాలు, ఆరోగ్య భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని మనవి. అంటూ వినతిపత్రంలో పేర్కొన్నారు.