J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ కాన్సులేట్ జనరల్, టకాహషి మునియో (Takahashi Muneo) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది.
చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఈ సందర్భంగా టకాహషి ప్రస్తావించారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (RPO) జొన్నలగడ్డ స్నేహజ , ఇతర అధికారులు పాల్గొన్నారు.