👉స్పెయిన్ దేశానికి రావాలని విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జువాన్ రాసిన ‘Momentum’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కి అందజేశారు. భేటీలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.