J.SURENDER KUMAR,
వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రహేజా గ్రూప్ తరపున ₹ 5 కోట్ల విరాళం అందజేశారు
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శనివారం ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. . సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజా కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
👉జీవీకే రెడ్డి ₹ కోట్లు..

వరద బాధితుల సహాయార్థం ప్రముఖ వ్యాపార వేత్త జీవీకే రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 5 కోట్లు విరాళం అందజేశారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో చేయూతను అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
👉వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ₹ 1.5 కోట్లు..

వరద బాధితుల సహాయార్థం వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వెల్లూరు వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ తో పాటు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నీ కలిసి చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.