సీఎం సహాయ నిధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి విరాళం !

J.SURENDER KUMAR,


వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ₹ 1కోటి రూపాయలు విరాళం అందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.