సీఎం సహాయ నిధికి ₹ 6.50 కోట్ల రూపాయలు!

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం ₹ 6 కోట్ల 50 లక్షలు విరాళాలు అందాయి.


👉మెగా గ్రూప్ ₹ 5 కోట్ల !

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగా గ్రూప్ ₹ 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి , కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి , ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు వారిని సీఎం అభినందించారు.


👉సైయెంట్‌ గ్రూపు ఫౌండర్ ₹ కోటి రూపాయలు!


సైయెంట్‌ గ్రూపు ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి అందుకు సంబంధించిన చెక్కును రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సైయెంట్‌ గ్రూపు వారిని ముఖ్యమంత్రి అభినందించారు.


👉సినీ నిర్మాత దిల్ రాజ్ ,₹ 25 లక్షలు.!


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 25 లక్షల విరాళం ప్రకటించిన సినీ నిర్మాత దిల్ రాజు . సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాలకు స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.


👉నిర్మాత సూర్యదేవర నాగవంశీ ₹25 లక్షలు.!


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹.25 లక్షల విరాళం ప్రకటించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.