సీఎం సహాయ నిధికి ₹ మూడు కోట్ల విరాళం!

J.SURENDER KUMAR,


వరద బాధితుల సహాయార్థం కేఎన్‌ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్‌ ఎండీ కే.నర్సింహారెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. జలంధర్‌ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి ₹ 2 కోట్ల రూపాయల విరాళం అందించారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు సీఎం వారికి అభినందనలు తెలియజేశారు.


👉ఎన్‌సీసీ కన్స్‌స్ట్రక్షన్స్…

వరద బాధితుల సహాయం కోసం ఎన్‌సీసీ కన్స్‌స్ట్రక్షన్స్ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్ ఏఏవీ రంగ రాజు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎన్‌సీసీ డైరెక్టర్ సూర్య తో పాటు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.