J.SURENDER KUMAR,
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి పలు సంస్థలు మంగళవారం ₹ 4.50 కోట్ల విరాళాలు అందించాయి.
👉హైదరాబాద్ రేస్ క్లబ్ ₹ 2 కోట్లు..
రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి , మరో డైరెక్టర్ నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి లను కలిసి ఈ మేరకు ₹ 2 కోట్ల రూపాయలు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.
👉అన్నపూర్ణ స్టూడియోస్ ₹ 50 లక్షలు !

వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 50 లక్షలు విరాళం ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు వారిని సీఎం అభినందించారు.
👉మైత్రా ఎనర్జీ గ్రూప్ & అక్షత్ గ్రీన్‌టెక్. ₹ 1కోటి రూపాయలు !

వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి మైత్రా ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ కైలాస్ , అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి కైలాస్ సంయుక్తంగా 1 కోటి రూపాయల విరాళం అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
👉లలితా జ్యువెలరీస్ సంస్థ.₹ కోటి రూపాయలు !

వరద బాధితులకు సహాయార్థం ప్రఖ్యాత లలితా జ్యువెలరీస్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 1 కోటి రూపాయల విరాళం అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన కిరణ్ కుమార్ ఈ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం వారందరినీ అభినందించారు.