సీఎం సహాయ నిధికి నిధుల వరద !


J.SURENDER KUMAR,


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి నారాయణ విద్యా సంస్థల తరఫున ₹ 2.5 కోట్ల రూపాయల విరాళం అందజేశారు.

నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పొంగూరు సింధూర, పొంగూరు శరణి, ప్రసిడెంట్ కె. పునీత్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు.


👉గ్రామీణ బ్యాంకు ₹ 50 లక్షలు.


వరద బాధితుల సహాయార్థం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 50 లక్షల రూపాయల విరాళం అందజేసింది. బ్యాంకు చైర్మన్ వై.శోభ ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులను అభినందించారు.


👉మోల్డ్ టెక్ ₹ 25 లక్షలు..


వరద బాధితుల సహాయార్థం మోల్డ్ టెక్ ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు. మోల్డ్ టెక్ వైఎస్-ప్రెసిడెంట్ జె. రాణా ప్రతాప్ ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.


👉శ్రీరాం ఫైనాన్స్ ₹1 కోటి రూపాయలు..


వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి గారు, జేఎండీ శ్రీనివాసరావు లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కెఆర్ సీ శేఖర్ , బిజినెస్ యూనిట్ హెడ్ ప్రవీణ్ రెడ్డి ప్రెసిడెంట్ వీవీఎన్ రెడ్డి జీఎం మహిపాల్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు.