J.SURENDER KUMAR,
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ ₹10 కోట్ల 25 లక్షల 65 వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్ , కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు
.
👉ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్.₹ 25 లక్షలు.

వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేసింది. FNCC అధ్యక్షులు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
👉ఎమ్మెల్యే విరాళం. ₹ 2.50 లక్షలు..

వరద బాధితుల సహాయార్థం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 2.50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.