సీఎం సహాయ నిధి కి 5 లక్షల విరాళం!

J.SURENDER KUMAR,


అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్‌ ఆఫ్ ఇండియా (ALEAP) ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹5 లక్షల రూపాయల విరాళం అందించింది.

ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి , ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని , సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు వారందరినీ ముఖ్యమంత్రి అభినందించారు.


👉రిటైర్డ్ తహసీల్దారు పెన్షన్ విరాళం !


రిటైర్డ్ తహసీల్దారు ప్రొద్దుటూరు చంద్రసేనా రెడ్డి తన నెల రోజుల పెన్షన్ ₹ 89,232 ను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులును కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు వీరికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.