J. SURENDER KUMAR ,
వరద బాధితుల సహాయార్థం పోలీసు శాఖ ఒక రోజు వేతనం ₹ 11,06,83,571 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా బుధవారం అందించారు.
పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఈ మొత్తానికి సంబంధించి చెక్కును హోం సెక్రెటరీ రవి గుప్తా , డీజీపీ జితేందర్ , ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి , పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి మంచి ఆశయంతో ముందుకొచ్చి సహాయాన్ని అందించిన పోలీసు శాఖకు ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలియజేశారు.
👉పోలీస్ క్రీడా భవనాన్ని ప్రారంభించిన సీఎం

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యాట్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.