J.SURENDER KUMAR,
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ ₹ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది.
చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ తరఫున ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు.
