సీఎం సహాయ నిధికి 20 లక్షల విరాళాలు!

J. SURENDER KUMAR,


వరద బాధితుల సహయార్థం టెక్నో పెయింట్స్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹ 20 లక్షల రూపాయలు విరాళంగా అందించింది.

టెక్నో పెయింట్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అకూరి శ్రీనివాసరెడ్డి, వైస్-చైర్మన్ సీవీఎల్ఎన్ మూర్తి, సీఈవో అనిల్ .కె తదితరులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు సీఎం వారిని అభినందించారు.


👉కుమారి ఆంటీ ఫుడ్స్ ₹ 50 వేలు !

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ ‘కుమారి ఆంటీ ఫుడ్స్’ నిర్వాహకురాలు కుమారి ₹ 50వేల రూపాయల విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు కుమారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.