👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తీరును ప్రశంసిస్తున్న పార్టీ అధిష్టానం !
J.SURENDER KUMAR,
దశాబ్ద కాలం గా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కకావికలమైన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి పదవుల పట్టాభిషేకం జరుగుతున్నది. పార్టీకి, నాయకుడికి కష్టకాలంలో వెన్నంటి ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ నామినేటెడ్ పదవుల కట్టబెట్టి పట్టాభిషేకం చేశారు.
నియోజకవర్గంలో ధర్మారం, వెలగటూర్, గొల్లపల్లి, ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ వైస్ చైర్మన్, సభ్యుల పదవులను వారి కే కట్టబెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 9 నెలల కాలంలో 3 నెలల పాటు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సాంకేతిక సమస్యలు, తదితర అంశాల నేపథ్యంలో ఆరు నెలల వ్యవధిలోని నియోజకవర్గంలోని నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పడ్డాయి.

👉పార్టీని వీడలేదు.. ప్రలోభాలకు లొంగలేదు !
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పదవుల ప్రలోభానికో, పైరవీలకో, వ్యాపారానికో , కాంట్రాక్ట్ పనులకో , వేధింపులు, తప్పుడు కేసులు తదితర అంశాల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే .
ఈ నేపథ్యంలో నాడు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కరువయ్యారు. మండల కేంద్రాల్లో 10 నుంచి 20 లోపు కార్యకర్తల, నాయకుల సంఖ్య, ఉండేది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ చర్యలకు నిరసనగా ధర్నాలు, ఆందోళన, రాస్తారోకోలు , చేపట్టినా, చేయడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులను ముందస్తుగా అరెస్టులు, పోలీస్ కేసులు, ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కు తీసుకెళ్లి నిర్బంధించడం షరా మామూలు.
👉క్యాడర్ ను మరువని లీడర్..
పలు మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఓటమి చెందడం, ఆర్థిక ఇబ్బందులు, ప్రత్యర్థుల హేళనలు, అవమానాలను దిగమింగుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కు ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టింది. కష్టకాలంలో తన వెంట ఉన్న క్యాడర్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మరువలేదు అనడానికి నియోజకవర్గంలోని నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకమే ప్రత్యక్ష నిదర్శనం అనే చర్చ నెలకొంది.
👉ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ!

చైర్మన్ గా లావుడియా రూప్లా నాయక్ !

. వైస్ చైర్మన్ గా అరిగే లింగయ్య !
👉 వెలగటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ!

చైర్ పర్సన్ గా శ్రీమతి గుండాటీ గోపిక జితేందర్ రెడ్డి !

వైస్ చైర్మన్ గోళ్ళ తిరుపతి !
👉గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ !

చైర్మన్ గా బీమా సంతోష్ !

వైస్ చైర్మన్ గా పురపాటి రాజిరెడ్డి !
👉ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ !

చైర్ పర్సన్ గా శ్రీమతి చిలుముల లావణ్య లక్ష్మణ్.

వైస్ చైర్మన్ గా సంగ. నరసింహులు.
👉 లక్ష్మణ్ కుమార్ రాజకీయ నేపథ్యం..

ఎన్ ఎస్ యు విద్యార్థి సంఘ నాయకుడిగా, జడ్పిటిసి సభ్యుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతూ, కాంగ్రెస్ అభ్యర్థిగా ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేస్తూ ఓటమి చెందినా , క్యాడర్ ను కాపాడుకుంటూ, లక్ష్మణ్ కుమార్ , పార్టీ మారకుండా ప్రలోభాలకు లొంగకుండా 2023 డిసెంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన తీరును ఢిల్లీ అధిష్టానం కు సిఫారసు చేసిన నివేదికలో సీఎం పేర్కొన్నారు.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు వరించడం తగు న్యాయమే అనే చర్చ జరుగుతున్నది