👉ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం సకాలంలో అందించుటకు తగు చర్యలు!
👉 ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
దళిత వర్గానికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సకాలంలో న్యాయం జరిగేలా చూడటం తమ బాధ్యత అని ఆయన ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు
బుధవారం జగిత్యాల కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన తర్వాత మొదటి సరిగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కమిటీకి ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ముఖ్యంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులు వివిధ స్థాయిలలో పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

పెండింగ్ లు ఉన్న వివాదంలో లేని భూములను, ఆదివాసీలు, గిరిజనుల భూములు కబ్జా కాకుండా చూడాలని, వారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేసి విచారణ చేయాలని, ఆర్థికంగా చాలా చిన్న కుటుంబాల వారు ఉంటారని, వారికి అన్యాయం జరుగకుండా చూడాలని పోలీస్ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే కోరారు.
ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుల పరిహారంలో ఎటువంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి జిల్లాకు నిధులు తీసుకువస్తానని తెలిపారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని జాగ్రత్తగా వ్యవహరించి తప్పు చేసిన వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడతూ…
ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులను ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని తెలిపారు. రాయికల్ మండలంలోని కోయ గూడెం గ్రామంలో ఆదివాసిలకు విద్యుత్ సౌకర్యం కల్పించుటకు గ్రామాన్ని విజిట్ చేసి రిపోర్ట్ సమర్పించాలని జగిత్యాల ఆర్డీఓ ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుల నమోదు, ఆయా కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు అందించవలసిన పరిహారంపై కమిటీ సభ్యులు చర్చించారు.
ఈ సమావేశంలో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల శాసన సభ్యులు డాక్టర్ కె. సంజయ్, ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, జగిత్యాల, మెట్ పల్లి డీఎస్పీలు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.