👉బ్రహ్మశ్రీ పాలెపు భరత్ శర్మ చే..
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ( శివాలయం) లో బ్రహ్మశ్రీ పాలెపు భరత్ శర్మ శ్రీ భాగవత సప్తాహ పురాణ ప్రవచన కార్యక్రమం మొదలుపెట్టారు.

స్థానిక శారదామహిళామండలి ఆధ్వర్యంలో మంగళవారం నుండి. ఈనెల 18 వరకు కొనసాగుతుంది. దేవస్థానం పక్షాన సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసా చార్యులు, అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్, సిబ్బంది శారదా మహిళా మండలి సభ్యులు, స్థానిక మహిళలు దేవస్థానం నుండి మేళతాళాలతో భరత్ కుమార్ శర్మ ఇంటికి వెల్లి వారికి పూలమాల, శేష వస్త్రం అందజేసి సాదరంగా ఆహ్వానించి నగర సంకీర్తన ద్వారా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఆహ్వానించారు.

తదనంతరం మొదటగా భాగవత గ్రంథానికి పూజచేసి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
