👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు!
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా శ్రీమతి చిలుముల లావణ్యను, వైస్ చైర్మన్ గా సంగ నరసింహులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 655, ఆగస్టు 31న జారీ చేసింది. రెండు సంవత్సరాల పదవి కాలంతోపాటు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం కొనసాగుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిటీలో 18 మంది సభ్యుల నియమిస్తూ పేర్కొన్నారు.


👉సభ్యులుగా.
1) గంధం రాజయ్య, 2) వాడుకోటి గీతాంజలి, 3)ఎండి రఫీ యుద్దీన్ 4) మెరుగు పరుశురామ్, 5) తోటి రాజయ్య, 6) ఏన్నం మధుకర్ రెడ్డి, 7) తాండ్ర అశోక్ రావు, 8)అనుగు జోగిరెడ్డి, 9) రామడుగు రవి, 10) కాసెట్టి రాజేష్, 11) గునిశెట్టి అంజయ్య,12) దైత శ్రీనివాస్, 13) తిమ్మాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు, 14) జిల్లా మార్కెటింగ్ అధికారి, 15) అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి వ్యవసాయ శాఖ 16), మున్సిపల్ చైర్ పర్సన్ ధర్మపురి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఎం రఘునందన్ రావు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
👉ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు !

తనను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవికి ఎంపిక చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, సంగ నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు.