ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న సినీ నటుడు రాజీవ్ కనకాల !

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ సినీనటుడు రాజీవ్ కనకాల దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వీరికి దేవస్థానం పక్షాన సాదరంగా స్వాగతం పలికిన పిదప వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించారు.


ఈ కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసా చార్యులు, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రమణయ్య అర్చకులు నంభి నరసింహ మూర్తి, మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.