ధర్మపురి సింగిల్ విండోలో(ఫ్యాక్స్) కోట్లాది రూపాయల దుర్వినియోగం !

👉బాధ్యులపై క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం!


J.SURENDER KUMAR,


ధర్మపురి సింగిల్ విండో తో పాటు పలు విండోలలో కోట్లాది

రూపాయల నిధులు బాధ్యులైన పలువురు స్వాహా చేసినట్టు

అధికారుల విచారణలో తేలింది. బాధ్యులపై క్రిమినల్ కేసు

నమోదు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.


ప్రాథమిక విచారణలో పలు సొసైటీలు కలుపుకొని ₹ 10 కోట్ల వరకు దుర్వినియోగమైనట్టు గుర్తించారు. దీంతోపాటు జిల్లాలో పలు సింగిల్ విండోలలో అధికారులు విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. నిధుల దుర్వినియోగం పై ప్రభుత్వం పలువురు ఉద్యోగులు అధికారులపై వేటుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం

.
👉రైతుల శ్రమ శక్తిని దోపిడీ చేశారు !


రైతులు ఆరుగాలం ఎండలో వానలో కష్టపడుతూ తమ రక్తమును చమటగా మార్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరలో కమిషన్ పొందుతూ, రైతుల పొట్ట కొట్టుతూ వారికి లబ్ధి కల్పించాల్సిన వారే విండో (ఫ్యాక్స్) కొట్లాది రూపాయల స్వాహా చేశారనీ, సబ్సిడీ ఎరువులు, రైస్ మిల్ ఏర్పాటుకు భూములు కొనుగోలు, ఎరువుల దుకాణాలు తదితర అంశాలలో అందినంత దోచుకొని రైతాంగం కడుపు కొట్టారని విచారణ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

తిమ్మాపూర్, జైన, గొల్లపల్లి., పెగడపల్లి తదితర సొసైటీలలో 2014-2023 మధ్యకాలంలో ఈ నిధుల గోల్మాల్ జరిగినట్టు విచారణ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. రెవెన్యూ రికవరీ చట్టం మేరకు గల్లంతైన కోట్లాది రూపాయల నిధులు రికవరీ చేయడానికి ప్రభుత్వానికి అధికారులు సిఫారసు చేసినట్లు తెలిసింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది