👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.!
J.SURENDER KUMAR,
ఈ నెల 14 న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి ధర్మారం కు రానున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండలంలో జిల్లా అధికారులతో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్న కటికెనపల్లి మరియు మేడారం గ్రామాలకు చెందిన 33/11 సబ్ స్టేషన్ల ప్రాంతాలను, పరిశీలించారు. ధర్మారం, ధర్మపురి, గొల్లపెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే మార్కెట్ యార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు ధర్మారం మండలం లోని కటికేనపెల్లి , మేడారం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం మార్కెట్ యార్డులో నూతంగా నియమితులైన ధర్మారం, ధర్మపురి, గొల్లపెల్లి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుందని, అన్నారు.

ధర్మారం మండలంలోని నీటిపారుదలకు సంబంధించిన పత్తిపాక, బొమ్మరెడ్డి పల్లె లో ఉన్న మిగులు పనులు, మరియు ఇతర సమస్యలను డిప్యూటీ సీఎం , మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు.
👉నరేష్ కు శ్రద్ధాంజలి !
కటికేనపల్లిలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కీ. శే . నరేష్ చాలా కృషి చేశాడని, ఈ రోజు మన మధ్య లేకపోవడం చాల బాధాకరమని, నరేష్ కృషి ఫలితంగా కటికెనపల్లిలో సబ్ స్టేషన్ ఏర్పాటు కానున్నదని ఎమ్మెల్యే అన్నారు. నరేష్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు.