ధర్మారం రాజకీయ బిక్ష పెట్టింది -ధర్మపురి ఆదరించింది !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J .SURENDER KUMAR,


ధర్మారం మండలం నన్ను జెడ్పిటిసి సభ్యుడిగా గెలిపించి, రాజకీయ బిక్ష పెట్టిందని, ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు నన్ను ఆదరించి ఉన్నత పదవి కట్టబెట్టారని వారి రుణం జీవితాంతం తీర్చుకోలేనిదని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో నంది మేడారం లో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ప్రభుత్వ సలహాదారు ఆర్కాల వేణుగోపాల్, వివిధ అభివృద్ధి పనులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.


తనను కరీంనగర్ జెడ్పి చైర్ పర్సన్ గా, నాడు మంత్రి శ్రీధర్ బాబు పదవి కట్టబెట్టారని లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాను ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఓటమి చెందిన నియోజకవర్గ ఓటర్లు తనను అక్కున చేర్చుకునీ, ఆదరించి 2018 గెలిపించిన నాటి ప్రభుత్వం అధికారులు ఓడించారు అని 2023 లో భారీ మెజార్టీతో గెలిపించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలుకు ఎల్లకాలం రుణపడి ఉంటాను అని అన్నారు..


ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉండాలని గెలుపు ఓటములు సహజమంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, తనకు అండగా ఉండి ధైర్యం చెబుతూ ముందడుగు వేయించారని, తాను కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.