గణపతి దేవాలయం లో సహస్ర అభిషేకం!


J.SURENDER KUMAR,


  హైదరాబాద్ కొత్తపేట గాయత్రి పురం  శ్రీ గణపతి దేవాలయం లో గురువారం 50 వ గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం జరిగింది.
డాక్టర్. వొజ్జెల దేవీ ప్రసాద్  వైదిక నిర్వహణ లో కార్యక్రమం అపురూపం గా జరిగింది. 2022 సెప్టెంబర్  నుండి ఈరోజు వరకు 50 ప్రదేశాల్లో నిర్వహించారు.

ఈ  సందర్భంగా మంచిర్యాల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొమ్మెర మురళీధర రావు అభిషేక సమన్వయ కర్త అయిన శ్రీ మహావాది వినోద్ కుమార్ ను  శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.


👉రేపు శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో..


రేపు శుక్రవారం 13-9-2024  శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం నగేశ్వర నగర్ కొత్తపేట హైదరాబాద్ లో ఉదయం 9.30 నుండి51 వ గణపతి సహస్ర అభిషేకం నిర్వహించనున్నట్టు
  సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్ కు  90000 13755  సంప్రదించాలని పేర్కొన్నారు