గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు !

J.SURENDER KUMAR,


రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దంపతులు ఆదివారం గణపతి హోమంలో పాల్గొని నిర్వహించారు.


నియోజకవర్గ కేంద్రమైన మంథని లో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు ఆయన ధర్మపత్ని సీనియర్ ఐఏఎస్ అధికారిని, ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్‌తో కలిసి లోక కళ్యాణార్థం హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు.


ప్రత్యేకంగా మథని పట్టణంలో రావుల చెరువు కట్ట పై ప్రతిష్టించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు లోక కళ్యాణ్ ర్థం పలు పూజాది కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ప్రత్యేక హోమంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పాల్గొన్నారు