ఘనంగా ముగిసిన తిరుచానూరు పవిత్రోత్సవాలు!

J.SURENDER KUMAR,

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. అందులో భాగంగా విశేష పూజ, అనంతరం మహా పూర్ణాహుతి, శాంతి హోమం, కుంభ సంప్రోక్షణ, నివేదన నిర్వహించారు.

సాయంత్రం చక్రస్నానం నిర్వహించి శ్రీ పద్మావతి అమ్మవారు సమేతంగా శ్రీ సుందరరాజ స్వామి ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. టీటీడీ ఈవో  జె శ్యామలరావు, జేఈవో శ్రీమతి గౌతమి, ఆలయ డీఈవో గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు.