గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం జీవో విడుదల!

👉మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలు

👉2023 డిసెంబర్ 7 నుంచి జీవో అమలు కానున్నది!


J.SURENDER KUMAR,


ప్రజాపాలన దినోత్సవానికి ఒకరోజు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఈ హామీ ప్రధానం. దీంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన జీవో లోని అంశాలు 2023 ఏడు నుంచి కార్మికుల సంక్షేమం కోసం అమలులోకి రానున్నాయి.


వివరాల్లోకి వెళ్తే..


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో సంఖ్య 205, సెప్టెంబర్ 16న. జారీ చేసింది.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న తెలంగాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం జారీ చేసిన జీవో


👉గల్ఫ్ కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి ₹ 5 లక్షల రూపాయలు పరిహారం. 2023 డిసెంబర్ 7 నుంచి చోటు చేసుకున్న ఘటనలకు ఇది వర్తిస్తుంది.


👉గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు


👉ప్రజా భవన్ లో కొనసాగుతోన్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా “ప్రవాసి ప్రజావాణి” కౌంటర్ ఏర్పాటు


👉ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం. ఇవ్వాల్సిందిగా జీవోలో పేర్కొన్నారు
.