👉 గల్ఫ్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో త్వరలో సమావేశం !
J.SURENDER KUMAR,
గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ ఎన్నారై సెల్ ప్రతినిధి బృందం ఆదివారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రేస్ ఇంచార్జి పి. వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ జెఏసి నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు లతో వేం నరేందర్ రెడ్డి చర్చించారు.
త్వరలో గల్ఫ్ ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17 లోగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.