హమ్మయ్య.. అవ్వకు పెన్షన్ వచ్చింది !

J.SURENDER KUMAR,

కొన్ని నెలలుగా సాంకేతిక కారణంగా రాని ఆసరా పెన్షన్ అవ్వకు వచ్చింది, హమ్మయ్య అంటూ అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


వివరాలు ఇలా ఉన్నాయి.


ధర్మపురి మున్సిపల్ పరిధికి చెందిన అయ్యోరి లక్ష్మికి సాంకేతిక కారణంతో కొన్ని నెలలుగా పెన్షన్ రావడం లేదు. ఈ మేరకు తన కూతుర్ని వెంటబెట్టుకొని ఆగస్టు లో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. సీఎం కార్యాలయ పిలుపుమేరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వాహనంలో వెళుతూ గేటు వద్ద వృద్ధురాలిని చూసి వాహన దిగి ఆమెను ‘ అవ్వ నడవడం చేతకాకున్నా ఎందుకు వచ్చావు ? అనీ ఎమ్మెల్యే ఆమెన్ అడిగారు. తనకు పెన్షన్ ఆగిపోయిందని, ఆయస పడుతూ వృద్ధురాలు విలపిస్తూ ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. చలించిన ఎమ్మెల్యే అవ్వ నువ్వు ఏడవకు, మరోసారి ఎక్కడికి రావద్దు. మీ ఇంటికి నీ పెన్షన్ వస్తుంది. అంటూ ఆమె సమక్షంలో సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేశాడు.

తన వ్యక్తిగత కార్యదర్శి నీ అవ్వ వెంట పంపిస్తున్నాను. సమస్య పరిష్కరించి సాంకేతిక కారణంగా నిలిచిపోయిన పెన్షన్ మంజూరు చేయండి. అంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించాడు.


‘ నీకు ఏ సమస్య ఉన్న నేరుగా నాకు ఫోన్ చేయమని వృద్ధురాలికి ఎమ్మెల్యే తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కష్టపడుతూ మరోసారి ఇక్కడికి రా వద్దని నీకు ఏ సమస్య ఉన్న నా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పరిష్కరిస్తారంటూ ఆవృద్ధురాలి ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఓదార్చారు.

వృద్ధురాలు అయ్యోరి లక్ష్మికి రెండు పెన్షన్లు మంజూరైనట్టు రికార్డులలో ఉండడంతో పెన్షన్ నిలిచిపోయిందని. జూలై ఆగస్టు ఓ నెల ఆసరా పెన్షన్ మంజురు అయిందని ఉద్యోగులు తెలిపారు.