హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J. SURENDRA KUMAR

వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

అనంతరం తెలంగాణ జానపద కళాకారుల సంఘం ద్వారా 10 మంది కోలాటం ఆడే మహిళలకు గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పైడిపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టూ ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలు ఇట్టి హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని,వర్ష కాలం కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదనీ,ప్రభుత్వ ఆసుపత్రిలో, మెడిసిన్స్,టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని,ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులు ఉంటారని,ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు వెళ్ళాలని,వైద్య పరంగా ఎటువంటి అవసరం ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చని అదే విధంగా గంగమ్మ తల్లి దేవాలయం మరియు ఇతరత్రా సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, ధర్మపురి ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరికి కష్టం ఉన్న నేరుగా వచ్చి నన్ను కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు

ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.