👉వడ్డీతో సహా క్లైమ్ డబ్బులు చెల్లించాలి అని ఆదేశం !
J.SURENDER KUMAR,
ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయ వేసి వినియోగదారుడికి వడ్డీతో సహా క్లెయిమ్ డబ్బులు చెల్లించాలని ఆదేశించింది.
👉వివరాలు ఇలా ఉన్నాయి…
కరీంనగర్ పట్టణం పాత బజారుకు చెందిన కొక్కుల గోపికృష్ణ, ఓరియంటల్ బ్యాంక్ అండ్ కామర్స్, కరీంనగర్ బ్రాంచ్ లో ‘ గుడ్ హెల్త్ ‘ ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నాడు. తనతో పాటు నలుగురు కుటుంబ సభ్యులకు వర్తించేలా బీమా పాలసీ పొందాడు.

గోపికృష్ణ కొడుకు రిషిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ‘ అంకుర ఆస్పత్రిలో ‘ 2020 జనవరి 10 న చేర్పించి తన కొడుకు శాస్త్రచికిత్స చేయించాడు. 2020. ఫిబ్రవరి 12 న ఆస్పత్రి లో బిల్లు
₹1, 68,000/- చెల్లించి డిశ్చార్జ్ అయ్యాడు.
తాము ఆస్పత్రికి చెల్లించిన బిల్లు డబ్బుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీ కి గోపికృష్ణ నివేదిక సమర్పించాడు.
ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వ్యాధికి భీమ వర్తించదు, అంకుర ఆసుపత్రికి. ఆపరేషన్ చేసే అర్హత లేదని గోపికృష్ణకు భీమా డబ్బులు చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. పలుమార్లు ఇన్సూరెన్స్ కంపెనీ నీ సంప్రదించి విసిగి వేసారి, 2021 మార్చ్ 31న జగిత్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీపై వినియోగదారుల ఫోరమ్ ను న్యాయం కోసం ఆశ్రయించాడు.
కేసు పూర్వపరాలు పరిశీలించి, ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు పరిగణంలోకి తీసుకొని, ఫోరమ్ సభ్యులు ఆసుపత్రికి కొక్కుల గోపికృష్ణ చెల్లించిన ₹ 1,68,000/- మొత్తానికి 31-3-2021 నుంచి 9% వడ్డీతో గోపికృష్ణ కు చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం మరో ఐదు వేలు చెల్లించాలని సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత, మరియు సిహెచ్ నరసింహారావు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.