జీవాంజి దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!

J.SURENDER KUMAR,

పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్ -2024లో మన దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.


పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి మనందరికీ గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి సందేశంలో పేర్కొన్నారు.

పారాలింపిక్స్ 2024లో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్స్, ప్లేయర్స్ అందరికీ ఈ సందర్బంగా సీఎం అభినందనలు తెలిపారు. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరో ప్రకటనలో దీప్తికి అభినందనలు తెలిపారు.