J.SURENDER KUMAR,
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయంలో దేవతల కల్యాణం సందర్భంగా టీటీడీ ఆచారం ప్రకారం పట్టువస్త్రాలు సమర్పిస్తోంది.

ముందుగా టీటీడీ ఈవోకు కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్, ఏఈవో విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం తిరుమల దేవస్థానం డీవైఈవో లోకనాథంతో పాటు టీటీడీ ఈవో స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.

అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఈ సందర్భంగా ఈఓను ఘనంగా సన్మానించారు.ఆలయ డీఈవో లోకనాధం కూడా ఉన్నారు