J.SURENDER KUMAR,
వినాయక నవరాత్రుల్లో భాగంగా మంగళ వారం ఖైరతాబాద్ సప్త ముఖ మహాశక్తి గణపతి సన్నిధి లో “గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం జరిగింది.

సనాతన ధర్మ పరిరక్షార్థం అన్యోన్య బ్రాహ్మణుల సహాయంతో “గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం” ఉదయం 5 గంటల నుండి వేదొక్తంగా ఎంతో అపురూపం గా జరిగింది. రాపర్తి మహాదేవ శర్మ , ఖైరతాబాద్ వినాయకుని ప్రధాన పూజారి సంపూర్ణ సహకారం తో వ్యవస్థాపకులు స్వర్గీయ సింగరి శంకరయ్య కుటుంబ సభ్యులు, మహ గణపతి సేవా సమితి చైర్మన్ సుదర్శన్ రాజ్ కుమార్ సింగరి, ప్రోత్సాహం తో, మారుపాక శేషు, రఘుకిషోర్, దేవీ ప్రసాద్, పురుషోత్తం ల వైదిక నిర్వహణ లో వెయ్యి సార్లు గణపతి ఉపనిషత్ 70 సంవత్సరాల, 70 అడుగుల 70 మంది బ్రాహ్మణుల సహాయంతో అభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది.

యువ కిషోరుడైన రఘు కిషోర్ గారి ప్రవచనం గణపతి ఉపనిషత్ గురించి భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.
ఈ కార్యక్రమంలో మధుసూధన్, సత్యమూర్తి, అనిల్ మహేష్, ప్రసాద్, హేమా శోభా తదితరులు పాల్గొన్నారు.
👉రేపు నల్లకుంటలో..

11-9-2024 బుదవారం దూర్వాష్టమి నాడు శ్రీ శృంగేరి శారదా శంకర మఠం నల్లకుంట లో 9.30 ఉదయం నుండి గణపతి సహస్ర అభిషేకం నిర్వహించనున్నట్టు సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.
వివరాలకు. ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని పేర్కొన్నారు 9000013755.