ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసి లక్ష్మణ్ కుమార్ ను శాలువాతో సన్మానించారు.


ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతిని ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ హోదాలో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నేను ప్రతి సంవత్సరం తప్పకుండా ఆ స్వామి వారిని దర్శించకుంటానని, అన్నారు

అధికారంలో ఉన్న లేకపోయినా ఈ స్వామి వారి దర్శనం నాకు ప్రతి సంవత్సరం దొరుకుతుందని, ధర్మపురి నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఆ దేవ దేవుడి ఆశీస్సులు మా పైన ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అని, రాష్ట్ర ప్రజానీకం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సందర్భంగా తెలిపారు.