కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం !

J.SURENDER KUMAR,


లక్ష్మణ్ బాపూజీ సేవలు ఎనలేనివి, చిరస్మరణీయం ,ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఎంతో ఆకాక్షించారు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పేగడపెల్లి మండలం సుద్ధపెల్లి గ్రామంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…


తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు నిరుపానమైనవని, స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఎంతో ఆకాక్షించారని, తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన మహోన్నతమైన వ్యక్తి అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


,తెలంగాణ త్యాగశీలుల్లో మొదటి వ్యక్తిగా నిలిచి ఉంటారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపడమే బాపూజీకి మనం అందించే నిజమైన నివాళి అని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదటి సారిగా ప్రభుత్వ పరంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, ధర్మపురి నియోజక వర్గ పద్మశాలి సోదరులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.


👉పరామర్శ..


పెగడపెల్లి మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒరిగల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి రాగ గురువారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీనివాస్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు..


👉బోర్ వెల్ ప్రారంభం…


అనంతరం సుద్దపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మినరల్ వాటర్ ప్లాంట్ కొరకు వేయించిన బోర్ వెల్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు,

తదుపరి ముదిరాజ్ ల ఆహ్వానం మేరకు గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..