క్రీడాకారులకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ భోజనాలు !

J.SURENDER KUMAR,


జిల్లాస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులకు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భోజనాల వసతి ఏర్పాటు చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్వామి వివేకానంద మినీ స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడ పోటీలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు క్రీడాకారులను ఉద్దేశించి మధ్యాహ్న భోజనం మీరే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
వేదికపై ఉన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పందించి వివిధ మండలాల్లో క్రీడా పోటీలలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు వారి భోజన బాక్స్ ఎలా తెచ్చుకుంటారని ? మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు.

ఈ మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచిత బోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, MLC జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ తో పాల్గొని క్రీడాకారులతో భోజనం చేశారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆ ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు