👉మౌలిక సదుపాయాల కోసం ₹ 933 కోట్లు!
👉30 నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా!
J.SURENDER KUMAR,
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లో 2025 జనవరి 12 న ప్రారంభం కానున్న కుంభమేళా కోసం ₹ 933 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 992 ప్రత్యేక రైళ్లను నడపడానికి మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ముందస్తు ఏర్పాట్లకు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను సమీక్షించేందుకు మంత్రి అశ్విని వైష్ణవ్, డిప్యూటీలు రవ్‌నీత్ సింగ్ బిట్టు మరియు వి సోమన్నతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీనియర్ రైల్వే అధికారులతో రెగ్యులర్ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.
కుంభమేళా కు దాదాపు 30 నుండి 50 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ కు తరలి వస్తారని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. ప్రత్యేక రైళ్లతో పాటు 6,580 సాధారణ రైళ్లను నడపాలని ప్లాన్ చేసింది. “2019లో, 24 కోట్ల మందికి పైగా తరలివచ్చారని, 5,000 సాధారణ సర్వీసులతో పాటు 694 ప్రత్యేక రైళ్లను నడిపినట్టు రైల్వే అధికారుల కథనం.
ప్రయాగ్‌రాజ్ డివిజన్ మరియు సమీప ప్రాంతాలలో రెట్టింపు రైల్వే ట్రాక్‌ల పనులు జరుగుతున్నాయి, దీనికి దాదాపు ₹ 3,700 కోట్లు ఖర్చు అవుతోంది. దాదాపు ₹.440 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డు ఓవర్ బ్రిడ్జిల పనులు కూడా సాగుతున్నాయి.
₹.495 కోట్లను రోడ్ల మరమ్మతులు, సీసీటీవీల ఏర్పాటు, అదనపు వసతి యూనిట్లు, వైద్య సదుపాయాలు వంటి వివిధ అభివృద్ధి కోసం కేటాయించారు.
వారణాసి మరియు ఝూసీల మధ్య డబ్లింగ్ లైన్లు పూర్తయ్యాయి అదనపు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.
(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)
