👉ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి!
J.SURENDER KUMAR,
మహిళలు విద్యా, వ్యాపార రంగాలలో స్వయం శక్తితో ఎదిగి వారి వారి కుటుంబ సభ్యులలో ఆత్మ స్థైర్యం పెంపొందేలా మార్గదర్శకులు కావాలి అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సతీమణి కాంతా కుమారి అన్నారు.
నియోజకవర్గంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, అవేర్నెస్ కార్యక్రమాన్ని మంగళవారం యోగ మెడిటేషన్ అండ్ ఇన్సూరెన్సు్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంత కుమారి మాట్లాడుతూ..

మహిళలు విద్యావంతులు అయితే చాలు వారి కుటుంబం, వారు జీవనం కొనసాగిస్తున్న గ్రామంలో మహిళలు చైతన్యవంతులై ప్రతి రంగంలో ముందుకు వస్తారని అన్నారు. మహిళా లోకం ఈచ్ వన్ టీచ్ వన్ విధానంతో సమాజంలో మూఢనమ్మకాలను, దురాచారాలను, మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి మానసికంగా ధైర్యవంతు లు గా ఎదుగుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి దాదాపు 40 మంది మహిళలు పాల్గొన్నారు.